ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Former Prime Minister: మాజీ ప్రధాని సంచలన కామెంట్స్.. ఆస్తి కోసం 9ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేశారు..

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:44 AM

బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్‌పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు.

- డీకేపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోపణలు

బెంగళూరు: బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్‌పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు. బుధవారం ఉడుపి నియోజకవర్గం మైత్రి అభ్యర్థి కోట శ్రీనివాసపూజారికి మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయ్యాయి. ఒక్కలిగలు తనను బలపరచాలని డీకే శివకుమార్‌ కోరడంపై దేవెగౌడ మండిపడ్డారు. నిన్ను ఎందుకు బలపరచాలని ప్రశ్నించారు. 9ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి ఆస్తులు రాయించుకున్నందుకా..? అంటూ నిలదీశారు. అమెరికాలో సంపాదించిన ఓ పారిశ్రామికవేత్త బిడది వద్ద ఓ ఐటీ కంపెనీ స్థాపించేందుకు సిద్ధమయ్యారన్నారు.

ఇదికూడా చదవండి: ఎన్డీయేకు 150 సీట్లైనా రావు

ఒక్కరోజు ముందే తప్పుడు పత్రాలను సిద్ధం చేసుకుని వాటి ద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లారని, రెండు చోట్ల ఎదురుదెబ్బ పడిందన్నారు. కానీ సదరు పారిశ్రామికవేత్త కుమార్తెను గంగమ్మతిమ్మయ్య కల్యాణమండపం పక్కన ఓ ఇంట్లో 9 రోజులపాటు బంధించారన్నారు. ఆస్తి పత్రాలపై సంతకం చేసి మీ కుమార్తెను తీసుకెళ్లాలని బెదిరించారని ఇటువంటివారిని బలపరచాలా అంటూ ప్రశ్నించారు. ఆ ఇంటికి తండ్రి చేరుకున్నాక బాలిక కళ్లకు కట్టిన గంతలు తొలగించారని, ఆ చిన్నారి తండ్రిని చూసి ఒక్కసారిగా పరుగు తీసి అక్కున చేరిందన్నారు. ఈ విషయాన్ని తనకు ఓ లాయర్‌ తెలియజేశారన్నారు. అతడి పేరు మరచిపోయానని అయితే ఓ ఐటీ పరిశ్రమ పెట్టాలని భావించిన వ్యక్తి జీవనం కోసం మరో చోటు పనిచేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఇదికూడా చదవండి: Elections 2024: రామనవమి ఘర్షణలకు కారణం మమతే.. బీజేపీ స్ట్రాంగ్ ఆరోపణలు..

Updated Date - Apr 18 , 2024 | 11:44 AM

Advertising
Advertising