Lok Sabha Elections: బీజేపీకి ఎదురుదెబ్బ.. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ రాజీనామా
ABN, Publish Date - Apr 08 , 2024 | 05:13 PM
లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు.
చండీగఢ్: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ హర్యానా (Haryana)లో బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ (Birender Singh) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. నెలరోజుల క్రితమే బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ లోక్‌సభకు రాజీనామా చేసి, బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీరేందర్ సింగ్ భార్య ప్రేమ్ లత సైతం బీజేపీకి రాజీనామా చేశారు.
Sanjay Dutt: రాజకీయాల్లోకి రావడంపై సంజయ్‌దత్ స్పష్టత..
కాంగ్రెస్‌లో చేరనున్న బీరేందర్
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సోమవారంనాడు మీడియా సమావేశంలో బీరేందర్ సింగ్ ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు పంపానని, 2014-2019 వరకూ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రేమ్ లత సైతం పార్టీని వీడారని చెప్పారు. ఇరువురూ మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. గతంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో సంబంధాలు సాగించిన బీరేందర్ సింగ్ పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు.
తండ్రీకొడుకులైన బీరేందర్, బ్రిజేందర్ సింగ్‌లు గతంలోనూ పలు అంశాల్లో బీజేపీతో విభేదించారు. 2020లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేసిన డిమాండ్‌కు వీరు మద్దతు పలికారు. లైంగింక వేధింపులు ఎదుర్కొన్న మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనకు సైతం మద్దతు ప్రకటించారు. కాగా, హర్యానా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 25న జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 08 , 2024 | 05:13 PM