Share News

Arvind Kejriwal: విద్యుత్ బిల్లులు తగ్గిస్తామన్న ట్రంప్.. మా హామీలు అమెరికా వరకూ వెళ్లాయన్న కేజ్రీవాల్

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:12 PM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 12 నెలలో ఇంధనం, విద్యుత్ ధరలను సగానికి సగం తగ్గిస్తామని, పర్యావరణ అనుమతులను వేగిరపరచడం ద్వారా విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

Arvind Kejriwal: విద్యుత్ బిల్లులు తగ్గిస్తామన్న ట్రంప్.. మా హామీలు అమెరికా వరకూ వెళ్లాయన్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఇంధన, విద్యుత్ ఛార్జీలను సగానికి సగం తగ్గిస్తామంటూ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ట్రంప్ చేసిన పోస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారంనాడు 'రీట్వీట్' చేశారు. ''ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి'' అంటూ వ్యాఖ్యానించారు.

Haryana: హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఇదే


ట్రంప్ ఏమన్నారు?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 12 నెలలో ఇంధనం, విద్యుత్ ధరలను సగానికి సగం తగ్గిస్తామని, పర్యావరణ అనుమతులను వేగిరపరచడం ద్వారా విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. తద్వారా ద్వవ్యోల్బణం తగ్గుతుందని, ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే భూమండలంలోనే ఉత్తమమైన ప్రదేశం అమెరికా, మరీ ముఖ్యంగా మిచికాన్‌ అవుతాయని అన్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ, కరెంట్ రేట్లు సగానికి సగం తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారని, ఉచిత తాయిలాలు అమెరికా వరకూ చేరాయని ట్వీట్ చేశారు.


ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉచిత కరెంట్ అందిస్తుండగా, ఢిల్లీ మోడల్ అంటే ఇచిత తాయిలాలేనంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. దీనిపై కేజ్రీవాల్ ఇటీవల స్పందిస్తూ, ఢిల్లీ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ అమలు చేస్తే తాను ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని సవాలు విసిరారు.


For National News And Telugu News

ఇది కూడా చదవండి...

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

Updated Date - Oct 11 , 2024 | 06:16 PM