ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: 15 రోజుల అరాచకాలు.. మోదీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

ABN, Publish Date - Jun 24 , 2024 | 06:25 PM

మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిన 15 రోజులపాటు అరాచక పాలన కొనసాగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.15 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న పది సమస్యలపై ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో మోదీ బిజీగా ఉన్నారని ఆరోపించారు.

ఢిల్లీ: మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిన 15 రోజులపాటు అరాచక పాలన కొనసాగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.15 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న పది సమస్యలపై ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో మోదీ బిజీగా ఉన్నారని ఆరోపించారు.

ఎక్స్‌లో ఆయన సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం నుంచి కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


15 రోజుల్లో భయంకరమైన రైలు ప్రమాదం, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, రైళ్లలో ప్రయాణికుల దుస్థితి, నీట్ స్కామ్, NEET పీజీ రద్దు, UGC NET పేపర్ లీక్, పెరుగుతున్న పాలు, పప్పులు, గ్యాస్, టోల్ ధరలు, మంటలతో మండుతున్న అడవులు, తాగునీటితో అల్లాడుతున్న ప్రజలు వంటి సమస్యలను ఆయన లేవనెత్తారు.

సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేని బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవని.. ఆ పార్టీ నేతలంతా ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అలా తాము జరగనివ్వమని రాహుల్ స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 06:31 PM

Advertising
Advertising