ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: ప్రియుడికి మరో యువతితో పెళ్లి.. ప్రియురాలు చేసిన పనికి గుండెలు అదిరిపోవాల్సిందే..

ABN, Publish Date - Feb 15 , 2024 | 05:54 PM

ప్రేమ.. ఈ రెండక్షరాలు చాలు కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండటానికి. కాస్త తేడా వచ్చిన ఇంక అంతే. తన విశ్వరూపం అంతా చూపించేస్తుంది. తనకు దక్కని వారు వేరెవరికి దక్కకూడదనే భావనతో ...

ప్రేమ.. ఈ రెండక్షరాలు చాలు కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండటానికి. కాస్త తేడా వచ్చిన ఇంక అంతే. తన విశ్వరూపం అంతా చూపించేస్తుంది. తనకు దక్కని వారు వేరెవరికి దక్కకూడదనే భావనతో ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని దారుణంగా హతమార్చిన ఉదంతం ఉలిక్కిపడేలా చేసింది. తనను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి జీర్ణించుకోలేకపోయింది. కోపంతో రగిలిపోయింది. మాయమాటలతో నమ్మించి మనసైన వాడిని కర్కశంగా మట్టుబెట్టేసింది. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఏమీ ఎరగనట్లు నటించింది. చివరికి చిన్న క్లూతో అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరారీలోని నివాసముండే గగన్ సహారియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అస్సాంకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత గగన్ ప్లేట్ ఫిరాయించేశాడు. మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు కక్ష పెంచుకుంది. అస్సాం నుంచి డైరెక్ట్ గా ఝాన్సీకి వచ్చింది. గగన్ ను అంతమొందించాలని భావించింది. ముందస్తు ప్లాన్ ప్రకారం తన బావతో కలిసి దారుణంగా హతమార్చింది. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది.


విషయం తెలిసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి తల్లి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. "తన కుమారుడి పెళ్లి కాగానే అతని మొదటి స్నేహితురాలు ( ప్రియురాలు ) సోషల్ మీడియాలో మెసేజ్ లు చేసేది. వివాహ బంధాన్ని వదులుకోవాలని గగన్ పై ఒత్తిడి తెచ్చింది. ఫిబ్రవరి 6న గగన్ ఇంట్లో ఉన్న సమయంలో యువతి, ఆమె బావ ఇద్దరూ ఇంటికి వచ్చి గగన్ ను కారులో తీసుకెళ్లారు. 3 గంటల తర్వాత గగన్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు. ముమ్మాటికి హత్యే" నని బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 05:54 PM

Advertising
Advertising