Jagdeep Dhankhar: విద్యార్థులను పట్టిపీడిస్తున్న కొత్త జబ్బుపై ఉపరాష్ట్రపతి ఆందోళన
ABN, Publish Date - Oct 19 , 2024 | 08:31 PM
దేశంలోని పిల్లలను కొత్త జబ్బు పీడిస్తోందని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జబ్బును ''ఫోరెక్స్ డ్రెయిన్, బ్రెయిన్ డ్రెయిన్''గా ఆయన అభివర్ణించారు.
జైపూర్: దేశంలోని పిల్లలను కొత్త జబ్బు పీడిస్తోందని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లాలనేదే ఆ కొత్త జబ్బు అని అన్నారు. ఈ జబ్బును ''ఫోరెక్స్ డ్రెయిన్, బ్రెయిన్ డ్రెయిన్''గా ఆయన అభివర్ణించారు. విద్యను వ్యాపారం చేయడం వల్ల నాణ్యతమై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇదెంతమాత్రం దేశ భవిష్యత్‌కు మంచిది కాదని హితవు పలికారు.
Jharkhand Elections: ఎన్నికల వేళ ఈసీఐ సంచలన నిర్ణయం.. డీజీపీ తొలగింపునకు ఆదేశం
రాజస్థాన్‌లోని సికార్‌లో ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ...''పిల్లల్లో మరో కొత్త జబ్బు కనిపిస్తోంది. పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కొంగ్రొత్త కలలు కంటున్నారు. కానీ ఏ సంస్థకు వెళ్తున్నాం, ఏ దేశానికి వెళ్తున్నాం అనే అంచనా వాళ్లలో ఉండటం లేదు. ఒక లెక్క ప్రకారం 2024లో 13 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇక్కడే చదివి ఉంటే తమకెంత ఉజ్వల భవిష్యత్తు ఉండేదోనని ఇప్పుడు వారు అర్ధం చేసుకుంటున్నారు'' అని అన్నారు.
విద్యార్థుల వలసల వల్ల 6 బిలియన్ యూఎస్ డాలర్ల విదేశీ మారకద్రవ్యానికి గండిపడిందని ధన్‌ఖడ్ చెప్పారు. ఈ మేథో వలసల విషయంలో పరిశ్రమ ప్రముఖలు విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని, మేథో వలసలను, కోల్పోతున్న విదేశీ మారకద్రవ్యాన్ని ఆపాలని కోరారు. ఇదే 6 బిలయన్ల డాలర్లతో మన విద్యాసంస్థల్లో ప్రాథమిక వసతుల కల్పన జరిగితే మనం ఎక్కడుంటామో ఒక్కసారి ఆలోచంచాలని అన్నారు. దీనిని తాను 'ఫోరెక్స్ డ్రయిన్, బ్రెయిన్ డ్రయిన్'గా పిలుస్తానని అన్నారు. ఇది జరక్కూడదని, విదేశాల్లో పరిస్థితులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని చెప్పారు. విద్య వ్యాపారంగా మారితే అది జాతి భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. కొన్ని కేసులో విద్య దోపిడీగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకుంటూ విద్యార్థులకు నాణ్యతాయుతమైన విద్యను అందించాలని విద్యాసంస్థలకు దిశానిర్దేశం చేశారు. ఈదిశగా జాతీయ విద్యా విధానాన్ని ఒక గేమ్ ఛెంజర్‌గా ఆయన ప్రశంసించారు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం
Updated Date - Oct 19 , 2024 | 08:31 PM