Google Maps: ఉత్తరప్రదేశ్‌లో కారు ప్రమాదం... స్పందించిన గూగుల్
ABN, Publish Date - Nov 27 , 2024 | 02:01 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబం వివాహా వేడుకకు కారులో బయలుదేరింది. ఆ క్రమంలో కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించాడు. దీంతో కారు బ్రిడ్జ్‌పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 27: గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి ప్రయాణించిన కారు.. బ్రిడ్జ్‌పై నుంచి కింద పడడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనపై గూగుల్ సంస్థ స్పందించింది. ఈ కేసు దర్యాపులో భాగంగా భారతీయ అధికారులకు తాము సహకరిస్తామని గూగుల్ సంస్థ స్పష్టం చేసింది.
Also Read: ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ
నవంబర్ 24వ తేదీ ఆదివారం ఓ కుటుంబం వివాహ వేడుకకు కారులో బయలుదేరింది. ఆ క్రమంలో కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించాడు. దీంతో ఆసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జ్‌పై కారు ప్రయాణిస్తూ.. రాంగంగా నదిలో పడి పోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటు చేసుకుంది.
Also Read: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసం.. మరొకటి వెలుగులోకి..
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఇప్పటికే నేవిగేషన్ యాప్‌కు సంబంధించిన అధికారులతోపాటు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వేళ.. గూగుల్ సంస్థ సైతం స్పందించింది. ఈ ప్రమాదంపై జరుగుతున్న విచారణలో తాము సహకరిస్తామని గూగుల్ సంస్థ ప్రకటించింది. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు గూగుల్ సంస్థ ఈ మెయిల్ ద్వారా పోలీసులకు తెలిపింది.
Also Read: మజ్జిగ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అయితే గతేడాది భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో సదరు బ్రిడ్జ్ తీవ్రంగా దెబ్బతిందని స్థానిక పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు ఇదే యాప్‌ను ఉపయోగించి.. గతంలో కేరళలోని పెరియార్ నదిలో కారు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వైద్యులు మరణించిన విషయం విధితమే.
Also Read: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ
మరోవైపు గూగుల్ యాప్స్ ద్వారా బాధితులుగా మారిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక యూఎస్‌లో అయితే ఈ యాప్స్ కారణంగా తన భర్త మరణించారంటూ కోర్టులో దావా సైతం వేసింది ఓ ఇల్లాలు.
Also Read: మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక
Also Read: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
మరి ఆయా కేసుల్లో ఇప్పటి వరకు ఎంత మేరకు పురోగతి సాధించాయానేదానిపై ఓ క్లారిటీ అయితే లేదు. అలాంటి వేళ.. యూపీలో జరిగిన ఈ ప్రమాదంపై గూగుల్ సంస్థ స్పందించడం చూస్తుంటే.. గతంలో జరిగిన ప్రమాదాలపై స్పందించే అవకాశముందనే ఓ చర్చ అయితే సర్వత్రా నడుస్తుంది.
For National News And Telugu News
Updated Date - Nov 27 , 2024 | 02:01 PM