ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha elctions: షిండే శివసేన నుంచి నటుడు గోవింద పోటీ..?

ABN, Publish Date - Mar 22 , 2024 | 02:43 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ సీటు నుంచి శివసేన టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఐదు రోజుల క్రితం గోవింద కలుసుకున్నారు. నార్త్-వెస్ట్ సీటును ఈసారి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు ఇచ్చేందుకు షిండే గ్రూప్ సముఖంగా లేదని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద (Govinda) ముంబై నార్త్-వెస్ట్ (Mumbai North-west) సీటు నుంచి శివసేన (Shiv Sena) టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఐదు రోజుల క్రితం గోవింద కలుసుకున్నారు. నార్త్-వెస్ట్ సీటును ఈసారి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు ఇచ్చేందుకు షిండే గ్రూప్ సముఖంగా లేదని తెలుస్తోంది. 2004లో నార్త్ ముంబై నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై గోవింద ఎంపీగా గెలిచారు. పెట్రోలియం, సహజవాయువుల శాఖ మాజీ మంత్రి, ఐదుసార్లు సిట్టింగ్ ఎంపీ రామ్ నాయక్‌పై 50,000 పైచిలుకు ఓట్లతో అప్పట్లో గోవింద నెగ్గారు.


గోవింద పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తరచు లోక్‌సభ సమావేశాలకు గైర్హాజర్ అవుతుండేవారనే పేరుంది. ఎంపీగా ఉంటూనే ఫిల్మ్ కెరీర్‌ను సాగించారు. అయితే సినీ కెరీర్‌ కూడా ఆ సమయంలో మందగించడంతో 2008 జనవరి 20న రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒక దశలో రాజకీయాలు తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపినట్టు ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 02:47 PM

Advertising
Advertising