GRAP 4th Phase: నేటి నుంచి 12వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసెస్.. యాక్షన్ ప్లాన్ 4 అమలు..
ABN, Publish Date - Nov 18 , 2024 | 07:20 AM
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB), పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాల్గో దశ (GRAP-4) నేటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గో దశ నేటి (నవంబర్ 18) నుంచి అమలు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇది అమల్లోకి రానుంది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని గమనించిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే నిత్యావసర సరుకులను తరలించే ట్రక్కులను అనుమతించనున్నారు.
ఆదేశాలు జారీ
ఢిల్లీలోని ఏక్యూఐ రాత్రి 9 గంటలకు 468గా నమోదైంది. AQI 450 దాటిన తర్వాత GRAP-IV నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించాలని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం 6 నుంచి 11 తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి.
ఈ నిబంధనల అమలు
- ఢిల్లీ వెలుపలి నుంచి వచ్చే అన్ని ట్రక్కుల ప్రవేశంపై నిషేధం ఉంటుంది. సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులు నిత్యావసర వస్తువులను రవాణా చేయడాన్ని నిషేధం నుంచి మినహాయించారు.
- ఢిల్లీలో నమోదైన మధ్యస్థ, భారీ డీజిల్‌తో నడిచే వస్తువుల వాహనాలపై నిషేధం. నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది
- NCT ఢిల్లీ డీజిల్ శక్తితో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధం. ఈ విభాగంలో BS-6 వాహనాలు మాత్రమే నడపగలవు
- NCRలో పరిశ్రమలపై నిషేధం. ప్రభుత్వం అధీకృతం చేసిన జాబితా వెలుపల PNG ఇంధనం, పాలు, పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు
- నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం. ఇది కాకుండా ఫ్లైఓవర్లు, హైవేలు, వంతెనలు, పైప్‌లైన్‌లతో సహా ఇతర కార్యకలాపాలపై నిషేధం
- కేంద్ర ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు
- NCR రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్, కార్పొరేషన్, ప్రైవేట్ కార్యాలయాలలో 50 శాతం సామర్థ్యంతో ఇంటి నుంచి పని చేసుకోవచ్చు
- డీజిల్ జనరేటర్ సెట్లపై నిషేధం
గాలి నాణ్యత సూచిక ప్రమాణాలు
AQI 0-50 మధ్యన ఉంటే 'మంచిది'. 51-100 ఉంటే 'సంతృప్తికరమైనది'. 101-200 మధ్య ఉంటే 'మితమైనది'. 201-300 మధ్య ఉంటే 'పూర్', 301-400 'చాలా పూర్', 401-500 'తీవ్రమైన' వర్గంలో పరిగణించబడుతుంది.
ఇవి కూడా చదవండి:
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Jiostar: మొదలైన జియోస్టార్.. రూ. 15కే డబుల్ డోస్ ఎంటర్ టైన్‌మెంట్
Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..
Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 18 , 2024 | 09:13 AM