Supriya Sule: రూ.32 వేలు పంపాలని బ్లాక్ మెయిల్
ABN, Publish Date - Aug 12 , 2024 | 04:37 PM
సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగి పోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు. నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు. భయపడ్డారో ఇక అంతే సంగతులు. ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.
ముంబై: సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగి పోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు. నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు. భయపడ్డారో ఇక అంతే సంగతులు. ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.
మరో ఎన్సీపీ నేత
సుప్రియా సూలే ఒక్కరే కాదు ఎన్సీపీ జనరల్ సెక్రటరీ అదితి వాట్సాప్ నంబర్ కూడా హ్యాకయ్యింది. రూ.10 వేలు పంపించాలని ఆమెను అడిగారట. నగదు పంపిస్తామని వారికి చెప్పామని, దాంతో బ్యాంక్ ఖాతా వివరాలు అందజేశారని సుప్రియా సూలే వివరించారు. వాట్సాప్ హ్యాక్ అయ్యిందని యావత్ పోలీస్ స్టేషన్‌లో సుప్రియా సూలే ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు ఓకే
‘ప్రస్తుతం నా ఫోన్ చక్కగా పనిచేస్తోంది. వాట్సాప్ వర్క్ అవుతోంది. వాట్సాప్ బృందం మంచి సహకారం అందజేశారు. పుణే రూరల్ పోలీసుల సహాయం మరచిపోలేను. నిన్న ఎవరైనా నాకు మెసేజ్ చేసి ఉంటే క్షమించగలరు. ఎందుకంటే ఆ సమయంలో మీకు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మొబైల్, వాట్సాప్ పని చేస్తుంది అని’ సుప్రియా సూలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఐటీ నోటీసులు
బడ్జెట్ సమావేశాల తర్వాత తనకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయని సుప్రియా సూలే వివరించారు. ‘అదేంటో తెలియదు.. నేను పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రతిసారి నోటీసులు వస్తాయి. అదే కేసు గురించి నోటీసులు ఇస్తారు. వారికి వివరణ ఇస్తా.. ఏమి జరగదు. దీనికి సంబంధించి సమాచారం మీకు కూడా అందజేస్తాను. నేను ఊరికే ఆరోపణలు చేయడం లేదు అని’ సుప్రియా సూలే స్పష్టం చేశారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 12 , 2024 | 04:37 PM