ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Budget 2024: 'హల్వా' వేడుకలో నిర్మలా సీతారామన్

ABN, Publish Date - Jul 16 , 2024 | 09:22 PM

ఏటా బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారంనాడు జరిగింది. కేంద్ర బడ్జెట్-2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: ఏటా బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే 'హల్వా' (Halwa) వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారంనాడు జరిగింది. కేంద్ర బడ్జెట్-2024-25 (Union Budget 2024-2025) ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పాల్గొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి హల్వా పంచారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సీనియర్ సెక్రటరీలు హాజరయ్యారు.


బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ 1980 నుంచి నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో తయారవుతోంది. బడ్జెట్‌ వివరాలు బయటకు రాకుండా అందరూ అక్కడే కొద్ది రోజుల పాటు ఉండేలా చేస్తారు. మొబైల్స్ ఫోన్స్‌కు కూడా అనుమతి ఉండదు. ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకూ జరగనుండగా, జూలై 23న పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న ఆరవ బడ్జెట్ ఇది.

For Latest News and National News click here

Updated Date - Jul 16 , 2024 | 09:22 PM

Advertising
Advertising
<