ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Assembly Elections: ఎన్నికల వేళ 13 మంది నేతలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:40 PM

పార్టీ బహిష్కరణ వేటు పడిన ప్రముఖ నేతల్లో గల్బా ఎస్‌సీ నియోజకవర్గానికి చెందిన నరేష్ ధాండే, జింద్ నుంచి ప్రదీప్ దిల్, పుండ్రి నుంచి సజ్జన్ సింగ్, పానిపట్ రూరల్ నుంచి విజయ్ జైన్ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఉదయ్ భాను ఆదేశాలు జారీ చేశారు.

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) వేళ కాంగ్రెస్ (Congress) పార్టీ కొరడా ఝలిపించింది. 13 మంది నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి వారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పోటీగా ఈ 13 మంది నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగడంతో కాంగ్రెస్ ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.


పార్టీ బహిష్కరణ వేటు పడిన ప్రముఖ నేతల్లో గల్బా ఎస్‌సీ నియోజకవర్గానికి చెందిన నరేష్ ధాండే, జింద్ నుంచి ప్రదీప్ దిల్, పుండ్రి నుంచి సజ్జన్ సింగ్, పానిపట్ రూరల్ నుంచి విజయ్ జైన్ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఉదయ్ భాను ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఐక్యత, క్రమశిక్షణకు పార్టీ కట్టుబడి ఉందనే సంకేతాలిచ్చారు.

MCD Election: ఎంసీడీ వివాదం.. ఆప్ కౌన్సలర్లు లేకుండానే ఆరో సీటుకు ఎన్నిక షురూ


తొలుత టిక్కెట్ల కేటాయింపుల విషయంలో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ అధిష్టానం వారికి నచ్చచెప్పింది. అయినప్పటికీ కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో అది 13 మంది పార్టీ నేతల బహిష్కరణకు దారితీసింది. పార్టీ అదేశాలతో సీనియర్ నేత, మాజీ మంత్రి సంపత్ సింగ్ నల్వా సీటు నుంచి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బవానీ ఖెర సెగ్మంట్ నుంచి పోటీని రామ్ కిష్ ఫౌజి విరమించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జస్బీర్ మలౌర్ సైతం పోటీ నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 8న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

రెడ్‌ బుక్‌ అమలు మొదలైంది!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 03:40 PM