Karan Dev Kamboj: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఓబీసీ కీలక నేత
ABN, Publish Date - Sep 13 , 2024 | 03:39 PM
బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన కాంబోజ్‌కు ఓబీసీ కమ్యూనిటీలో మంచి పేరుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం హర్యానా బీజేపీకి గట్టి సవాల్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఓబీసీ మోర్చా (OBC Morcha) రాష్ట్ర అధ్యక్షుడు కరణ్ దేవ్ కాంబోజ్ (Karndev Kamboj) కాంగ్రెస్ (Congress) పార్టీలో శుక్రవారంనాడు చేరారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి ఉదయ్‌భాన్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం
బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన కాంబోజ్‌కు ఓబీసీ కమ్యూనిటీలో మంచి పేరుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి గట్టి సవాల్ కావచ్చని అంచనా వేస్తున్నారు. హర్యానాలోని ఓబీసీ నేతల్లో కాంబోజ్ ఒకరు. ఓబీసీ కమ్యూనిటీని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని కాంబోజ్ ప్రధాన ఆరోపణగా ఉంది. ఇంద్రి, రౌడార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంలో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేస్తానని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి టిక్కెట్లు ఇచ్చారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరణ్ దేవ్‌ను శాంతింప చేసేందుకు ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ ప్రయత్నించినప్పటికీ ప్రయోజన లేకపోయింది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరుగనుండగా, 8న ఫలితాలు ప్రకటిస్తారు.
Read MoreNational News and Latest Telugu New
Updated Date - Sep 13 , 2024 | 03:42 PM