ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Assembly Elections: ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్... జనం నాడి ఇదేనన్న మోదీ

ABN, Publish Date - Sep 25 , 2024 | 04:27 PM

సోనిపట్ జిల్లాలోని రోహ్‌తక్-పానిపట్ హైవే బైపాస్ వెంబడి బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ హర్యానాను మధ్యవర్తులు, అల్లుళ్లుకు కాంగ్రెస్ అప్పగించిందని ఆరోపించారు.

సోనిపట్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు (Haryana Assembly Elections) దగ్గరవుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతోందని, బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. మరోసారి బీజేపీ సర్కార్ అంటూ హర్యానా ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతోందన్నారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనిపట్ జిల్లాలోని రోహ్‌తక్-పానిపట్ హైవే బైపాస్ వెంబడి బుధవారంనాడు ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. గాంధీ కుటుంబంపై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ హర్యానాను మధ్యవర్తులు (Middlemen), అల్లుళ్లు (Son-in-law)కు కాంగ్రెస్ అప్పగించిందని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్పనిసరని, ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని తీసుకువచ్చింది. దేశంలో అవినీతికి జన్మ స్థానమైనది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

Kangana Ranaut: సాగుచట్టాలపై వ్యాఖ్యలకు కంగన క్షమాపణ


వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో టాప్ ప్లేస్

బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రాల్లో హర్యానా ఒకటని ప్రధాని అన్నారు. పారిశ్రామికీకరణ జరిగినప్పుడు పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని చెప్పారు. హర్యానాను 'మెడల్ ఫ్యాక్టరీ'గా మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అనేక మెడల్స్ తెచ్చుకుంటున్నారని అభినందించారు. కాగా, 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

Updated Date - Sep 25 , 2024 | 04:27 PM