Haryana: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ
ABN, Publish Date - Jun 19 , 2024 | 04:41 PM
హర్యానా అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కిరణ్ చౌదరి, ఆమె కుమార్తె శృతి చౌదరి భారతీయ బుధవారం జనతా పార్టీలో చేరారు.
హర్యానా, జూన్ 19: హర్యానా అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కిరణ్ చౌదరి, ఆమె కుమార్తె శృతి చౌదరి భారతీయ బుధవారం జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ సమక్షంలో వారిద్దరు బీజేపీ కండువా కప్పుకున్నారు.
అనంతరం వారు విలేకర్ల సమావేశంలోమాట్లాడారు. బీజేపీ విధి విధానాలు రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీని వరుసగా ప్రజలు ఎన్నుకుంటున్నారని చెప్పారు. బీజేపీ.. ఎలా దినదినాభివృద్ధి చెందుతుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. బీజేపీని తాము మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. హర్యానా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకోన్న విపరీత ధోరణలను ఈ సందర్భంగా వారు సోదాహరణగా వివరించారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. హర్యానా వికాస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలి.. బీజేపీ జెండాను చేతిలోకి తీసుకోవాలంటూ ఈ సందర్భంగా తమ మద్దతుదారులకు వారు పిలుపునిచ్చారు. హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ గెలిపించేందుకు సిద్దం కావాలంటూ మద్దతుదారులకు కిరణ్ చౌదరి, శృతి చౌదరి సూచించారు.
మరోవైపు కిరణ్ చౌదరి.. హర్యానా మాజీ సీఎం బన్సీలాల్ కోడలు. ప్రస్తుతం ఆమె బివానీ జిల్లాలోని తోషమ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా శృతి చౌదరి ఉన్నారు. అయితే వీరిద్దరు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విధితమే. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 04:41 PM