H D Revanna: కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన హెచ్‌డీ రేవణ్ణకు మరో షాక్
ABN, Publish Date - May 06 , 2024 | 07:56 AM
మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్న జేడీఎస్ నేత హెచ్ డీ రేవణ్ణ(H D Revanna)కు మరో షాక్ తగిలింది. హెచ్‌డీ రేవణ్ణను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి పంపింది. ఇప్పుడు ఆయన మే 8 వరకు సిట్ కస్టడీ(custody)లో ఉంటారు. శనివారం (మే 4న) సిట్ అతడిని అరెస్టు చేసింది.
మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్న జేడీఎస్ నేత హెచ్ డీ రేవణ్ణ(H D Revanna)కు మరో షాక్ తగిలింది. హెచ్‌డీ రేవణ్ణను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి పంపింది. ఇప్పుడు ఆయన మే 8 వరకు సిట్ కస్టడీ(custody)లో ఉంటారు. శనివారం (మే 4న) సిట్ అతడిని అరెస్టు చేసింది. హెచ్‌డీ రేవణ్ణ శనివారం (మే 4వ తేదీ) ప్రత్యేక కోర్టులో సిట్(SIT) కస్టడీని సవాలు చేశారు. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అంతకుముందు హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు తర్వాత, సిట్ అధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
సిట్(SIT) బృందం అతన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలను కుట్రగా హెచ్‌డీ రేవణ్ణ అభివర్ణించారు. ఈ కేసు తనపై రాజకీయ కుట్ర అని, తన రాజకీయ జీవితంలో ఇలాంటివి చూడలేదని హెచ్‌డి రేవణ్ణ(Revanna) అన్నారు. 40 ఏళ్ల రాజకీయాల్లో తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. ఏప్రిల్ 28న తనపై ఫిర్యాదు చేశారని, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. తనను అరెస్ట్ చేయాలనే దురుద్దేశంతోనే కిడ్నాప్ కేసు(kidnapping) పెట్టి అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు.
హెచ్‌డీ రేవణ్ణపై అదృశ్యమైన మహిళ కుమారుడు ఫిర్యాదు చేశారు. కొన్ని వీడియోలను ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లికి పంపారని ఆరోపించారు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఈ అంశంపై సిట్ విచారణ జరుపుతోంది. మరోవైపు సెక్స్ వీడియోల స్కాం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ(prajwal revanna)తోపాటు రేవణ్ణ కూడా నిందితులుగా ఉన్నారు. కానీ ప్రజ్వల్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఆయనకు పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
For Latest News and National News click here
Updated Date - May 06 , 2024 | 08:06 AM