ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMD Alert: ఈ రాష్టాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

ABN, Publish Date - Aug 03 , 2024 | 04:30 PM

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు(rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Heavy rains imd alert

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు(rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌(himachal pradesh)లో వర్షాల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగగా, మరోవైపు వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో ఆగస్టు 6 వరకు హిమాచల్‌లోని 10 జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో బీహార్(Bihar)-జార్ఖండ్‌లో రాబోయే 36 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర(maharashtra)కు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటితోపాటు వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.


ఈ ప్రాంతాల్లో

ఇంకోవైపు ఉత్తరాఖండ్‌(uttarakhand)లో భారీ వర్షాల కారణంగా హరిద్వార్, డెహ్రాడూన్, టెహ్రీ, రుద్రప్రయాగ్, నైనిటాల్‌లలో ఇప్పటివరకు 16 మంది మరణించారు. ఆగస్ట్ 1 రాత్రి భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 5 వేల మందికి పైగా యాత్రికులు కేదార్‌నాథ్ యాత్ర కాలినడక మార్గంలో చిక్కుకుపోయారు. లించోలి, భింబాలిలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 5 వేల మందిని రక్షించారు. ఇందుకోసం చినూక్, ఎంఐ 17 సహా 7 హెలికాప్టర్ల సాయం తీసుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ను రెండు రోజుల పాటు మూసివేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.


తెలంగాణ సహా

ఐఎండీ ప్రకారం ఆగస్టు 3న మధ్యప్రదేశ్, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌(gujarat)లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ, ఛత్తీస్‌గఢ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కేరళ, కోస్టల్ కర్ణాటకలలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. హర్యానాలో రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారాయి. గత 24 గంటల్లో హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇంకోవైపు తెలంగాణ(telangana)లో కూడా వచ్చే నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్(ap) విషయానికి వస్తే ఆగస్టు 6 వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.


Also Read:

Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!

Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. కారణమిదే..

For Latest News and National News Click Here

Updated Date - Aug 03 , 2024 | 04:31 PM

Advertising
Advertising
<