ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy rains: దంచికొడుతున్న వర్షాలు.. పలు రైళ్లు రద్దు, కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:49 AM

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర(Maharashtra)లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబై(Mumbai)లోని అంధేరి సబ్‌వేలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.

Heavy rains in Mumbai pune

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర(Maharashtra)లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబై(Mumbai)లోని అంధేరి సబ్‌వేలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు పూణె, కొల్హాపూర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధం ఏర్పడి జనజీవనం స్తంభించింది. పాఠశాలలు మూసివేయబడ్డాయి. పూణేలోని పింప్రి చించ్‌వాడ్‌లోని అనేక నివాస అపార్ట్‌మెంట్లు జలమయమయ్యాయి. ఏక్తా నగర్ వంటి వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు అగ్నిమాపక శాఖ పడవలను ఉపయోగిస్తోంది. కొన్ని చోట్ల నడుము మట్టం వరకు నీరు చేరుకుంది. ఈ క్రమంలో పలు చోట్ల రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


ముగ్గురు మృతి

పూణె(pune)లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షాల(rains) కారణంగా నీట మునిగిన హ్యాండ్‌కార్ట్‌ను తరలించే ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మరణించారని పోలీసులు తెలిపారు. డెక్కన్ జింఖానా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. ఖడక్‌వాస్లా డ్యామ్ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. కురుస్తున్న వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడంతో ముతా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పూణె జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని లెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్‌ను నిషేధిస్తామని ఆయన వెల్లడించారు.


రెడ్ అలర్ట్

భారీ వర్షాల(heavy rains) కారణంగా ఖడక్ వాస్లా డ్యాం కూడా పూర్తి స్థాయికి చేరుకుంది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో ఒకటైన విహార్ సరస్సు ఈరోజు తెల్లవారుజామున పొంగిపొర్లడం ప్రారంభించిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. వాతావరణ శాఖ గురువారం మహారాష్ట్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచనలు జారీ చేసింది. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పంచగంగా నది ప్రమాద స్థాయి కంటే కొన్ని అంగుళాల దిగువన ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు నమోదైన లెక్కల ప్రకారం రాజారాం వాగు వద్ద పంచగంగా నీటి మట్టం 42.2 అడుగులకు చేరుకుంది. ఇది ప్రమాదకర స్థాయి 43 అడుగుల కంటే 8 అంగుళాల దిగువన ఉందన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Saturn Lunar Eclipse: నేడు ఈ ప్రాంతాల్లో శని చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త

విదేశాలకు వెళ్లాలంటే బ్లాక్‌ మనీ ఎన్వోసీ తప్పనిసరి

ఆర్టీఐ కింద చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వలేం!


Read More National News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 12:13 PM

Advertising
Advertising
<