ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Himachal Pradesh: భారీగా కురిసిన మంచు.. చిక్కుకున్న వెయ్యి వాహనాలు, పర్యాటకులు

ABN, Publish Date - Dec 24 , 2024 | 08:02 AM

అసలే చలికాలం. ఇదే సమయంలో చలి ప్రదేశమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలోనే మంచు కారణంగా సోమవారం రాత్రి అటల్ టన్నెల్ సమీపంలో దాదాపు వెయ్యి వాహనాలు నిలిచిపోయాయి.

Snowfall Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో భారీగా కురుస్తున్న తెల్లటి మంచు దుప్పటితో కష్టాలు పెరుగుతున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా మనాలి(manali), సోలాంగ్ నాలా, అటల్ టన్నెల్ మధ్య సుమారు 1000 వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటల్ టన్నెల్ నుంచి మనాలిలోని సోలాంగ్ నాలా వరకు లేహ్ మనాలి జాతీయ రహదారిపై మంచు భారీగా కురిసింది. దీంతో వాహనాలు జారిపోయి సొరంగం దగ్గర అనేక వాహనాలను ఆపవలసి వచ్చింది. ఇదే సమయంలో మంచు దృష్యాలను చూసేందుకు అక్కడికి చేరుకున్న పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు.


ఇతర ప్రాంతాలకు

మరికొంత మంది అటల్ టన్నెల్ సమీపంలోని లాహౌల్ స్పితి సందర్శనకు వెళ్లాలని చూసిన పర్యాటకులను పోలీసులు నిలిపివేశారు. ఆ తర్వాత హిమపాతంలో చిక్కుకున్న పర్యాటకులను పోలీసులు రక్షించారు. లాహౌల్ స్పితిని సందర్శించేందుకు సోమవారం మనాలికి 12 వేల మంది పర్యాటకులు వచ్చారు. ఆ సమయంలో పర్యాటకులు అటల్ టన్నెల్, కోక్సర్, సిస్సు ఇతర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం తరువాత వాతావరణం మారిపోయింది. పర్యాటకులందరూ అక్కడ చిక్కుకుపోయారు. లాహౌల్ స్పితి పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 23న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 6178 వాహనాలు సొరంగం దాటాయి. ఇందులో 3530 వాహనాలు పర్యాటకులవి.


మంచు కురుస్తున్న నేపథ్యంలో

రోడ్లపై మంచు కారణంగా కొన్ని ప్రదేశాలలో రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. కొన్ని చోట్ల వాహనాలు జారడం ప్రారంభించాయి. ఫలితంగా దక్షిణ పోర్టల్ నుంచి ఉత్తర పోర్టల్ ఆఫ్ అటల్ టన్నెల్ వరకు వెయ్యి మందికి పైగా పర్యాటకులు మంచులో చిక్కుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వాహనాలను తప్పించారు. దీంతో మైదాన ప్రాంతాల్లో చాలా మంది డ్రైవర్లు మంచు కురుస్తున్న సమయంలో వాహనాలు నడపలేక పోవడంతో వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.


ఇరువైపులా వాహనాలు

సాయంత్రం హిమపాతం ప్రారంభమైన వెంటనే మనాలి వైపు వెళ్లాలనుకునే పర్యాటకులను ఆపివేశారు. అదే సమయంలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు మంచు మీద డ్రైవింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీని కారణంగా వారి వాహనాలు జారిపడి ఇరుక్కుపోతున్నాయి. దీంతో సొరంగం దగ్గర చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 1000 వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. సొరంగ మార్గం నుంచి మనాలి వైపు సోలాంగ్ నాలా వరకు చాలా చోట్ల వాహనాలు జారిపోయాయి. అతి కష్టం మీద వాహనాలకు క్రమంగా దారి మళ్లించారు. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆ తర్వాత హిమపాతంలో చిక్కుకున్న పర్యాటక వాహనాలను రక్షించగలిగారు.


ఇవి కూడా చదవండి:

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 24 , 2024 | 08:15 AM