ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hemant Soren: ఈడీ అరెస్ట్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ

ABN, Publish Date - Feb 02 , 2024 | 09:06 AM

జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది.

ఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ (Hemant Soren) తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. భూ ఆక్రమణ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. అంతకుముందు జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ గురువారం ఉదయం 10.30 గంటలకు విచారించాల్సి ఉంది. అంతలోనే పిటిషన్‌ను హేమంత్ సోరెన్ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి గురువారం నాడు హేమంత్ సోరెన్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింగ్వీ తీసుకెళ్లారు. దాంతో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 09:06 AM

Advertising
Advertising