Hero Darshan: బళ్లారి జైలు నుంచి దర్శన్ విడుదల..
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:16 PM
రేణుకాస్వామి హత్యకేసులో ఏ-2 నిందితుగా ఉంటూ బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నడ హీరో దర్శన్(Hero Darshan) బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలను సాయంత్రం 5 గంటలకు న్యాయవాది జైలర్(Jailer)కు అందజేశారు. పరిశీలించిన ఆయన దర్శన్‌ను విడుదల చేశారు.
బళ్లారి(బెంగళూరు): రేణుకాస్వామి హత్యకేసులో ఏ-2 నిందితుగా ఉంటూ బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నడ హీరో దర్శన్(Hero Darshan) బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలను సాయంత్రం 5 గంటలకు న్యాయవాది జైలర్(Jailer)కు అందజేశారు. పరిశీలించిన ఆయన దర్శన్‌ను విడుదల చేశారు. ఆనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయాధికారి మంజూరు చేశారు. ఆగస్టు నెల 29న బళ్లారి జైలుకు దర్శన్‌ను తీసుకొచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..
సుమారు 60 రోజుల పాటు బళ్లారి జైల్లో దర్శన్ నిందితుడగా హై సెక్యూరిటీ సెల్(High security cell)లో ఉన్నారు. ఆయన కోసం ఆయన భార్య, తల్లి , సోదరులు, బావ మరిది అనేక సార్లు వచ్చారు. దర్శన్ విడుదల సందర్భంగా ఆయన భార్య జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే భార్యను కౌగిలించుకుని దర్శన్ భావోధ్వేగానికి గురై కన్నీరు మున్నీరయ్యారు. పోలీసుల బందోబస్తు నడుమ బయటకు వచ్చిన ఆయన కారు ఎక్కి బెంగళూరు వైపు తరలి వెళ్లారు. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ వల్లే విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి
ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 31 , 2024 | 12:16 PM