Hero Darshan: హీరో దర్శన్ కస్టడీ మరో14 రోజులు పొడిగింపు
ABN, Publish Date - Jul 05 , 2024 | 12:05 PM
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్(Actor Darshan)తో పాటు మరో 16 మందికి కస్టడీ గడువు పెంచుతూ కోర్టు ఆదేశించింది.
బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్(Actor Darshan)తో పాటు మరో 16 మందికి కస్టడీ గడువు పెంచుతూ కోర్టు ఆదేశించింది. దర్శన్, పవిత్రాగౌడ, ఇతర నిందితుల జ్యుడిషియల్ కస్టడీ గురువారంతో ముగియనుండటంతో విచారణలు జరుపుతున్న సిట్ అధికారులు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల కస్డడీ పొడిగించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. నిందితులను నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.
ఇదికూడా చదవండి: Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి
కేసులో నిందితులు 13 మంది బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉండగా, నలుగురు తుమకూరు జిల్లా జైలులో ఉన్నారు. ఒకేసారి 17 మందిని వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జూలై 18వ తేదీ దాకా కస్టడీ పెంచుతూ తీర్పు ప్రకటించారు. కోర్టు తీర్పు ప్రకారం మరో 14 రోజుల పాటు దర్శన్‌తో పాటు బృందం జైలులోనే గడపాల్సి ఉంటుంది.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 05 , 2024 | 12:05 PM