ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hero Darshan: హీరో దర్శన్‌కు జైలు భోజనమే..

ABN, Publish Date - Jul 26 , 2024 | 12:55 PM

చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జైలుపాలైన నటుడు దర్శన్‌(Actor Darshan)కు పరప్పన అగ్రహార జైలు(Parappana Agrahara Jail) భోజనమే కొనసాగుతుంది. ఇంటి భోజనం, పరుపు, దుస్తులు కోరుతూ దర్శన్‌ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను 24వ ఏసీఎంఎం కోర్టు కొట్టివేసింది. జైలు భోజనంతో అజీర్ణం, అతిసార అవుతోందని, శరీరం బరువు తగ్గుతున్నానని కారణాలు చూపుతూ ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని దర్శన్‌ తరపు న్యాయవాదులు పిటీషన్‌ దాఖలు చేసుకున్నారు.

- పిటీషన్‌ కొట్టేసిన కోర్టు

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జైలుపాలైన నటుడు దర్శన్‌(Actor Darshan)కు పరప్పన అగ్రహార జైలు(Parappana Agrahara Jail) భోజనమే కొనసాగుతుంది. ఇంటి భోజనం, పరుపు, దుస్తులు కోరుతూ దర్శన్‌ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను 24వ ఏసీఎంఎం కోర్టు కొట్టివేసింది. జైలు భోజనంతో అజీర్ణం, అతిసార అవుతోందని, శరీరం బరువు తగ్గుతున్నానని కారణాలు చూపుతూ ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని దర్శన్‌ తరపు న్యాయవాదులు పిటీషన్‌ దాఖలు చేసుకున్నారు. గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తి విశ్వనాథ్‌ సీ గౌడర్‌ తీర్పును ప్రకటించారు.

ఇదికూడా చదవండి: Tungabhadra: ఉధృ‘తుంగా’.. ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర


హత్యకేసులో అరెస్టు అయినవారికి ఇంటిభోజనం, ఇతరత్రా సౌలభ్యాలకు అవకాశం లేదని, జైలు నిబంధనల ప్రకారం అక్కడి భోజనం, దుస్తులు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తూ పిటీషన్‌(Petition)ను కొట్టివేశారు. జైలు భోజనానికి సంబంధించి వైద్యులు ఎటువంటి సందేహం వ్యక్తం చేయలేదని, షూటింగ్‌ వేళ ఆయన గాయం ప్రస్తావన మాత్రమే చూపారని పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(Public Prosecutor) తెలిపారు. దర్శన్‌కు బయటనుంచి భోజనం కల్పిస్తే ఎక్కడైనా పొరపాటు జరిగితే ఎవరు బాధ్యులని ప్రాసిక్యూటర్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: క్రైం బ్రాంచ్‌ పోలీసులమంటూ.. రూ.22 లక్షలు కొట్టేశారు..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 12:55 PM

Advertising
Advertising
<