ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah: సీఏఏ అమలుపై కేజ్రీవాల్ విమర్శలపై అమిత్ షా కౌంటర్

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:01 PM

సీఏఏ అమలు అంశం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వరుసగా ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటివల ఢిల్లీ సీఎం ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించి కేజ్రీవాల్‌కు కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీఏఏ చట్టంపై ప్రతిపక్షాల వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. సీఏఏ(Citizenship Amendment Act) కారణంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇటీవల పాకిస్తాన్, ఆప్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారతదేశానికి వస్తారని, దీంతో దొంగతనం, దోపిడీలు, అత్యాచారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. దీనిపై అమిత్ షా స్పందించారు. ఢిల్లీ సీఎం అవినీతి కేసులు క్రమంగా బట్టబయలు కావడం వల్లే ఆయన సహనం కోల్పోయారని అన్నారు.

వీరంతా భారత్‌(bharat)కు ఎప్పుడో వచ్చారని, దేశంలో నివసిస్తున్నారని, వారికి హక్కులు లేవని కేజ్రీవాల్‌కు బహుశా తెలియదని షా అన్నారు. వారికి ఆ హక్కు కల్పించాలని చెప్పారు. అటువంటి పరిస్థితిలో 2014 వరకు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని అన్నారు. కేజ్రీవాల్‌(Kejriwal)కు అంత ఆందోళన ఉంటే బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రోహింగ్యాలు, ముస్లింలను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మిగతా వారిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.


మీరు హిందూ, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ శరణార్థులను మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగారు. 1947 దేశ విభజన నేపథ్యాన్ని కేజ్రీవాల్ మరచిపోయారని షా అన్నారు. బహుశా అతను ఆ శరణార్థుల కుటుంబాలతో టీ తాగి ఉండవచ్చని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. యాభైలలో, అరవైలలో, ఎనభైలలో వచ్చిన వారికి నేటికీ కూడా పౌరసత్వం పొందలేదని అన్నారు. వారికి మంచి ఉద్యోగాలు లభించవు. సొంత పేరుతో ఆస్తిని కొనుగోలు చేయలేరని అన్నారు. ఇంతమంది చేసిన నేరం ఏంటని హోంమంత్రి(home minister) ప్రశ్నించారు. వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇస్తామని అప్పట్లో అందరూ చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రం వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Amit Shah: సీఏఏ అంశంపై మమత, స్టాలిన్, ఒవైసీలపై అమిత్ షా ఫైర్.. ఏ వర్గానికి భయపడేది లేదని వెల్లడి

Updated Date - Mar 14 , 2024 | 12:12 PM

Advertising
Advertising