IMD: రెండు రోజుల్లో అల్పపీడనం.. 11, 13 తేదీల్లో కుండపోత
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:15 PM
బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 11, 13 తేదీల్లో రాజధాని నగరం చెన్నైలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని తెలిపారు.
చెన్నై: బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 11, 13 తేదీల్లో రాజధాని నగరం చెన్నైలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. ఇక ఈశాన్య బంగళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పీడనం రెండరోజుల్లో పడమటి దిశగా శ్రీలంక తీరం వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: TVK: కలిసొచ్చే పార్టీలతో దోస్తీకి సిద్ధం
ఈశాన్య అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో లక్షద్వీపాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొనడటంతో కన్నియాకుమారి(Kanniyakumari), తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 10న కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 11, 13 తేదీల్లో చెన్నై, చెంగల్పట్టు కాంచీపురం, తిరువళ్లూరు, రామనాథపురం, పుదుకోట(Thiruvallur, Ramanathapuram, Pudukota), తంజావూరు,
తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలలోనూ పలుచోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 12న కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, విరుదునగర్, మదురై, శివగంగ, రామనాథపురం, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, కడలూరు, మైలాడుదురై తదితర జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఆన్‌లైన్‌లోనే!
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే
Read Latest Telangana News and National News
Updated Date - Nov 09 , 2024 | 12:15 PM