ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMD: ఐఎండీ అలర్ట్.. రేపు రాజస్థాన్ సహా 28 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్

ABN, Publish Date - Sep 07 , 2024 | 07:39 PM

దేశంలో రుతుపవనాలు మళ్లీ ఊపందుకున్నారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల భారీ వర్షాలు(rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో రేపు (సెప్టెంబర్ 8న) 28 రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఈ జాబితాలో ఏ ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ చుద్దాం.

imd rain alert several states

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు మళ్లీ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపు అంటే ఆదివారం కూడా 28 రాష్ట్రాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం ఆదివారం దేశ రాజధానిలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌తో సహా ఎన్‌సీఆర్‌లోని కొన్ని చోట్ల వర్షం పడవచ్చు.


ఏడారి ప్రాంతంలో

రుతుపవనాలు మరోసారి బలపడటంతో రాజస్థాన్ రాజధాని జైపూర్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాగల 24 గంటల్లో తూర్పు రాజస్థాన్‌లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ రాజస్థాన్‌లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వాన పడే ఛాన్స్ ఉంది. తూర్పు రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 8న ఉదయపూర్, అజ్మీర్, జైపూర్ డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 8-9 తేదీలలో కోట, అజ్మీర్, జైపూర్ డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.


మంచు ప్రదేశాల్లో కూడా..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు రాష్ట్రంలో వర్షాల కారణంగా 40 రోడ్లు మూసుకుపోయాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం వర్షం రేపు కూడా కొనసాగనుంది. సిమ్లా, సోలన్, సిర్మౌర్, మండి, బిలాస్‌పూర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నందున వరద హెచ్చరికలు జారీ చేశారు. కిన్నౌర్, లాహౌల్-స్పితి మినహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 10 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు.


మరికొన్ని చోట్ల

దీంతోపాటు సెప్టెంబర్ 8న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జాబితాలో మణిపూర్, మిజోరాం, త్రిపుర, జార్ఖండ్‌లు కూడా ఉన్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల పాటు బీహార్‌లో రుతుపవనాలు బలమైన స్థితిలో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10 వరకు బీహార్ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ ‘అలర్ట్‌’ జారీ చేసింది. ఆదివారం కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, యానాం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతోపాటు తెలంగాణలో కూడా వర్షాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 10వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..


BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read More National News and Latest Telugu News

Updated Date - Sep 07 , 2024 | 07:42 PM

Advertising
Advertising