ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maharashtra: పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు.. నలుగురు దుర్మరణం..

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:35 AM

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడ్డారని సీనియర్ అధికారి తెలిపారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడ్డారని సీనియర్ అధికారి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున విధ్వంసకర చర్యలకు పాల్పడాలన్న ఉద్దేశ్యంతో కొందరు నక్సలైట్లు ప్రాణహిత నదిని దాటి పొరుగున ఉన్న తెలంగాణ ( Telangana ) నుంచి గడ్చిరోలిలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక పోరాట విభాగం C-60 టీమ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్విక్ యాక్షన్ టీమ్‌ స్పాట్ కు చేరుకుంది.

రేపన్‌పల్లి సమీపంలోని కోలమర్క కొండల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి రివార్డు ఉండటం గమనార్హం. ఎన్ కౌంటర్ అనంతరం స్పాట్ నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఒక కార్బైన్, రెండు కంట్రీ మేడ్ పిస్టోల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 11:36 AM

Advertising
Advertising