ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking: అయ్యో.. చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది..

ABN, Publish Date - Nov 18 , 2024 | 02:43 PM

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది. సరదాగా గడిపేందుకు వచ్చిన ముగ్గురు యువతులు.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ..

Mangaluru

మంగళూరు, నవంబర్ 18: మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది. సరదాగా గడిపేందుకు వచ్చిన ముగ్గురు యువతులు.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైసూరుకు చెందిన ముగ్గురు యువతులు నిషిత(21), పార్వతి(20), కీర్తన(21) సరదాగా గడిపేందుకు మంగళూరులో విల్మా అనే ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌కు వచ్చారు. ఈ ముగ్గురు శనివారమే రిసార్ట్‌కు వచ్చారు. మరుసటి రోజు అంటే ఆదివారం నాడు స్విమ్మింగ్ పూల్ వద్ద సరదాగా కాలక్షేపం చేశారు. స్వి్మ్మింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. తాము స్విమ్మింగ్ చేయడాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసేందుకు వీలుగా తమ ఫోన్లను సెట్ చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ తరువాతే సీన్ రివర్స్ అయ్యింది.


ఈ ముగ్గురికీ కనీసం ఈత కూడా రాదు. అయినప్పటికీ.. స్మిమ్మింగ్ పూల్‌లోని డీప్ ఎండ్‌లోకి ప్రవేశించారు. చాలా లోతు వరకు వెళ్లారు. ఇంకేముంది.. నీటిలో సరిగా నిలబడలేని స్థితికి చేరారు. ఒక అమ్మాయి అటూ ఇటూ బ్యాలెన్స్ తప్పుతూ మునిగిపోతుండగా.. మరో ఇద్దరు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు కూడా నీటిలో మునిగిపోయారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ పూల్‌ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగిపోయే క్రమంలో అమ్మాయిలు గట్టిగా అరిచినప్పటికీ.. చాలా సమయం వరకు రిసార్ట్ సిబ్బంది ఎవరూ గమనించలేదు. కాసేపటి తరువాత.. వీరిని గుర్తించిన సిబ్బంది.. వెంటనే వారికి బయటకు తీశారు. కానీ, అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వారు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. యువతుల మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


పోలీసుల విచారణలో నమ్మశక్యం కాని విషయాలు వెలుగు చూశారు. ఈ ముగ్గురికీ ఈత రాదని.. అయినప్పటికీ నీటిలోకి దిగడం వల్లే ఇంతటి విషాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. అయితే, లైఫ్ గార్డ్ అందుబాటులో ఉంచకపోవడం, భద్రతా లోపం, స్విమ్మింగ్ పూల్ లోతును తెలియజేసే ఇండికేషన్స్ ఏర్పాటు చేయకపోవడం, స్విమ్మింగ్ పూల్ భద్రతా మార్గదర్శకాలకు సంబంధించి హెచ్చరికల బోర్డును ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో రిసార్ట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రిసార్ట్ మేనేజర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రిసార్ట్ నిర్లక్ష్యం వల్లే ఈ ముగ్గురు చనిపోయారని.. కఠిన చర్యలు తీసుకుంటామని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.


Also Read:

10 సెకెన్లలో ఈ పజిల్ పని పట్టండి..

ఇది మహా మాయ.. ఈ షాప్‌లను చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మీ వాహనానికి ఇవి ఉన్నాయా.. లేదంటే మీకే నష్టం..

For More National News and Telugu News..

Updated Date - Nov 18 , 2024 | 02:43 PM