ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

ABN, Publish Date - Jun 05 , 2024 | 07:03 PM

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' (INDIA) కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.

NDA meet: మోదీ పేరు ఏకగ్రీవం.. రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు


కాగా, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సుప్రీం మమతా బెనర్జీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే ఉద్ధవ్ థాకరే తరఫున సంజయ్ రౌత్, టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ 'ఇండియా' కూటమి సమావేశానికి హజరవుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు అంగీకరిస్తే తాము మద్దతు ప్రకటిస్తామని సమావేశానికి ముందు సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు. 'ఇండియా' కూటమి తరఫున ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దానిపై కూటమి నేతల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 07:19 PM

Advertising
Advertising