India - Russia : మీకు మేమున్నాం.. మాస్కో ఉగ్రదాడిపై రష్యాకు భారత్ భరోసా..
ABN, Publish Date - Mar 24 , 2024 | 12:48 PM
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. క్రోకస్ సిటీ హాల్‌లోని కిక్కిరిసిన ఆడిటోరియంపై శుక్రవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 133 మంది మృత్యువాత పడటమే కాకుండా 140 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటనపై ఇండియా స్పందించింది. “మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం భరోసాగా నిలుస్తుంది” అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
న్యూదిల్లీలో రష్యా దౌత్యకార్యాలయం గేటు వద్ద పూలమాలలు వేసి మృతులకు నివాళులర్పించారు. దాడి జరిగిన తర్వాత నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశామని, వారందరూ ఇతర దేశాలకు చెందిన వారని రష్యా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈ దాడిని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), నాటోలు సైతం ఖండించాయి. తాము అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని అమెరికా తెలిపింది.
ఆ రెండు పార్టీలు కలిసి అవినీతి చేశాయి.. ఆమె బాధకు కేజ్రీవాలే కారణం.. బీజేపీ
ఇస్లామిక్ స్టేట్ మీడియా విభాగం అమాక్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందేశాలలో నలుగురు ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. ముసుగులు ధరించి దాడికి పాల్పడినట్లు చూపుతున్న ఒక ఫొటోను పోస్ట్ చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 24 , 2024 | 12:48 PM