ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

UP: యూపీలో ఎవరిది పైచేయి?

ABN, Publish Date - May 16 , 2024 | 03:37 AM

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.

  • ఎన్‌డీఏకు ఇండియా గట్టి పోటీ

  • ఎస్పీ-కాంగ్రెస్‌వైపు దళితులు, ముస్లింలు.. బీఎస్పీ బలహీనం

న్యూఢిల్లీ, మే 15 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది. ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్‌ (ఎస్‌) మరో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో తమ ఎన్‌డీఏ కూటమి 75కుపైగా స్థానాలను సాధిస్తుందని కమల నాథులు ఆత్మవిశ్వాసంతో ఉండగా.. 50 సీట్లకే పరిమితం అవుతుందని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న వాళ్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీనైతే యూపీలో ఇండియా కూటమి తుఫాన్‌ రానుందని, 50 సీట్లను తాము గెల్చుకుంటామని చెప్పారు. దీంతో ప్రజాతీర్పు ఎవరికి అనుకూలమనేది ఆసక్తిగా మారింది.


అఖిలేశ్‌.. పీడీఏ వ్యూహం

రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, ఎస్పీ నేతృత్వంలోని ఇండియా కూటముల మధ్య పోటీ కేంద్రీకృతమై ఉండగా.. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఒవైసీ ఎంఐఎం కూడా యూపీలో ఓ స్థానిక పార్టీతో కలిసి తన ఉనికి కోసం పోరాడుతోంది. ఇండియా కూటమితో పోలిస్తే పలు సామాజిక వర్గాలను ఎన్‌డీఏ కూటమి తమ వైపునకు తిప్పుకొన్నప్పటికీ ఈసారి గతంలో లేనంతగా బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం- గతంలో ప్రతిపక్ష ఓట్లను చీల్చిన బీఎస్పీ రోజురోజుకూ బలహీనపడుతోంది. 2019 ఎన్నికల్లో దాదాపు 20ు ఓట్లు సాధించిన ఆ పార్టీ.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 13ు ఓట్లకే పరిమితమైంది. ప్రస్తుత ఎన్నికల్లో తన ఓటు శాతాన్ని మరింత కోల్పోనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ బలమైన మద్దతుదారైన దళిత ఓటుబ్యాంకులో గణనీయమైన భాగం ఈసారి కాంగ్రెస్‌వైపు మళ్లిందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా.. తమ పార్టీపై ఉన్న యాదవ్‌-ముస్లింల పార్టీ అన్న ముద్రను చెరిపివేసుకునేలా ఈసారి పీడీఏ (పిచ్‌డా దళిత్‌ అల్పసంఖ్యాక్‌ - బీసీ, ఎస్సీ, మైనారిటీ) నినాదంతో కొత్త ప్రయోగానికి తెర తీశారు. ఎస్పీ పోటీ చేస్తున్న 62 సీట్లలో కుర్మీ, మౌర్య, శాక్య తదితర పలు బీసీ వర్గాలకు, దళితులకు సీట్లు కేటాయించారు. ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ హిందూ అభ్యర్థులనే అఖిలేశ్‌ నిలబెట్టి.. బీజేపీ హిందూ-ముస్లిం వ్యూహాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మరోవైపు, పలు నియోజకవర్గాల్లో బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను బరిలో నిలిపింది. 20 సీట్లలో ఎంఐఎం తలపడుతోంది.

Updated Date - May 16 , 2024 | 03:37 AM

Advertising
Advertising