Share News

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:09 PM

దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక

అబూదాబీ: దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.

ఇందుకు సంబంధించి ప్రకటనను జారీ చేసింది. భారీ వర్షాలతో అతలాకుతలమైన జన జీవనాన్ని సాధారణ స్థితికి తేవడానికి యూఏఇ అధికారులు నిత్యం పని చేస్తున్నారు.


రద్దైన, దారి మళ్లించిన విమానాల లిస్టును అధికారులు విడుదల చేశారు. దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ పౌరులకు సహాయం చేయడానికి, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 17న అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసింది.

ఆకుపచ్చగా ఆకాశం..

ఎడారి దేశం దుబాయిను తీవ్ర తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక భారీ వర్షాలకు రోడ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయం, రన్ వేలు మొదలైనవన్నీ నీటితో నిండిపోయాయి. గత 75 ఏళ్లలో దుబాయిలో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఈ వరదల కారణంగా నగరంలో భారీ నష్టం సంభవించింది.

ఈ తీవ్ర తుఫాన్ సమయంలో అక్కడ చోటు చేసుకున్న వాతావరణ మార్పులు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాను కమ్మేస్తున్న సమయంలో ఆకాశంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.


సెకన్ల వ్యవధిలోనే ఆకాశం ఆకుపచ్చగా మారిపోయింది. విపరీతమైన గాలులు కమ్మేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో గ్రాఫిక్స్ తరహాలో క్షణాల్లోనే అంతా మారిపోయి కుంభవృష్టి మొదలైంది.

అక్కడ సాధారణంగా ఏడాదికి 200 మి.లీ. వర్షం మాత్రమే కురుస్తుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేస్తుంది. కానీ ఇప్పుడు రికార్డులు తిరగరాసే వర్షపాతం నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 04:09 PM