ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:22 PM

పొరుగున్న బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారత్‌ వ్యక్తి అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో 26 ఏళ్ల తమ కస్టడీలోనే ఉంచారు. దాంతో 37 ఏళ్లు బంగ్లా జైల్లో మగ్గిన అతడు తాజాగా విడుదలై.. భారత్‌లోని స్వగ్రామంలో ఇంటికి చేరుకున్నాడు.

అగర్తల, ఆగస్ట్ 21: భార్య గర్భంతో ఉండగా.. జైలుకు వెళ్లాడు. దాదాపు 37 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడులయ్యాడు. మంగళవారం స్వగ్రామంలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఇంట్లో తన భార్య, కుమారుడిని చూసుకొని.. ఆనందంతో అతడు ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ అనందాన్ని వర్ణించడానికి తనకు మాటలు రావడం లేదన్నాడు.

వీళ్లను మళ్లీ ఇలా చూస్తానను కోలేదని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇది మళ్లీ తనకు పునర్జన్మ అని స్పష్టం చేశాడు. జారా ఫౌండేషన్ కృషితోనే తాను ఇలా జైలు నుంచి విడుదలయ్యానని తెలిపాడు. ఆ ఫౌండేషన్‌కు తన జీవితాంతం రుణ పడి ఉంటానని స్పష్టం చేశాడు. ఆ ఫౌండేషన్ చైర్మన్ మౌషాహిద్ అలీకి ఈ సందర్భంగా షాజహాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: KTR: తప్పుంటే.. దగ్గరుండి ఫామ్ హౌస్ కూలగొట్టిస్తా


బంగ్లాదేశ్‌లో బంధువుల ఇంటికి వెళ్లి..

దాదాపు 37 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న ఆ వ్యక్తి పేరు షాజహాన్. త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాల జిల్లాలోని రబీంద్రనగర్ గ్రామం అతడి స్వస్థలం. ఈ గ్రామం భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. 1988లో పొరుగునున్న బంగ్లాదేశ్‌లోని తన బంధువుల ఇంటికెళ్లాడు. ఇంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా బంగ్లాదేశ్‌కు వచ్చావంటూ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి బంగ్లాదేశ్‌లోని కోమిల్లా కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష ముగిసిన తర్వాత.. అతడిని ఆ దేశ జైలు అధికారులు విడిచి పెట్టలేదు. మరో 26 ఏళ్ల పాటు అతడు వాళ్ల కస్టడీలోనే ఉండిపోయాడు.


జారా పౌండేషన్ చొరవతో...

దీంతో అతడు జైలుకెళ్లి 37 ఏళ్లు అయింది. ఈ అంశంపై మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై జారా ఫౌండేషన్ స్పందించింది. జైలు నుంచి షాజహాన్ విడుదల కోసం ఇరుదేశాల ఉన్నతాధికారులను జోక్యం చేసుకోవాలంటూ పలుమార్లు అభ్యర్థించింది. అలాగే అతడి విడుదల కోసం న్యాయ స్థానాల చుట్టు పౌండేషన్ తిరిగింది. ఆ క్రమంలో అతడి విడుదల కోసం సంబంధిత ఉన్నధికారులను సైతం ఫౌండేషన్ సిబ్బంది కలిశారు. అలా చివరకు ఆగస్ట్ 20వ తేదీన బంగ్లాదేశ్‌లోని జైలు నుంచి షాజహాన్ విడుదలయ్యారు. 25 ఏళ్ల వయస్సులో షాజహాన్ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య గర్బవతిగా ఉంది. ప్రస్తుతం షాజహాన్ వయస్సు 62 ఏళ్లు.


మౌషాహిద్ అలీ కృషితోనే..

దీంతో బంగ్లాదేశ్ సరిహద్దు అధికారులు అతడిని భారత్ సరిహద్దు అధికారులకు అప్పగించారు. దాంతో అతడు స్వగ్రామానికి చేరుకున్నాడు. వివిధ దేశాల్లో చిక్కుకున్నవారినే కాకుండా.. విదేశాల్లో అన్యాయంగా జైలులో మగ్గుతూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు జారా ఫౌండేషన్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ఫౌండేషన్ చైర్మన్ మౌషాహిద్ అలీ అలా వ్యవహరించడంతోనే షాజహాన్ బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 04:53 PM

Advertising
Advertising
<