Share News

Indian Railways: ట్రైన్ టికెట్‌లో 55 శాతం రాయితీ... అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 13 , 2024 | 08:41 AM

దేశంలో ప్రతి ప్రయాణికుడి రైలు టికెట్ పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. ఆయన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad) లో జరుగుతున్న బుల్లెట్ రైలు నిర్మాణ పనులపై శుక్రవారం రివ్యూ నిర్వహించారు.

Indian Railways: ట్రైన్ టికెట్‌లో 55 శాతం రాయితీ... అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అహ్మదాబాద్: దేశంలో ప్రతి ప్రయాణికుడి రైలు టికెట్ పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. ఆయన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad) లో జరుగుతున్న బుల్లెట్ రైలు నిర్మాణ పనులపై శుక్రవారం రివ్యూ నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. సీనియర్ సిటిజన్ల కోసం కొవిడ్ కి ముందున్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ పై స్పందిస్తూ.. భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్టుపై 55 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ ట్రైన్ టికెట్ ధర రూ.100 ఉంటే కేవలం రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నట్లు చెప్పారు.


రూ.55 రాయితీ ఇస్తోందన్నారు. కరోనా లాక్ డౌన్ కి ముందు 2020లో టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లు, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైల్వే శాఖ 50 శాతం సబ్సిడీ కల్పించింది. 2022లో రైళ్లన్నీ మళ్లీ ప్రారంభమైయ్యాక తిరిగి రాయితీలను పునరుద్ధరించలేదు.

పార్లమెంటులో ఇదే అంశం చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్ కి చెందిన చంద్రశేఖర్ గౌర్ ఇదే అంశంపై ఆర్టీఐకు దరఖాస్తు చేయగా కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుంచి రూ.2,242 కోట్లు ఆర్జించిందని తెలిసింది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 13 , 2024 | 08:43 AM