ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jai shankar: ఈ నెలలో పాకిస్థాన్‌కు జైశంకర్‌

ABN, Publish Date - Oct 05 , 2024 | 05:11 AM

కేంద్ర విదే శాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈ నెలలో పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరిగే షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) శిఖరాగ్ర

న్యూఢిల్లీ, అక్టోబరు 4: కేంద్ర విదే శాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈ నెలలో పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరిగే షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నట్టు విదే శాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో నిర్వహించే ఎస్‌సీవో కౌన్సిల్‌ ఆఫ్‌ హెడ్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ (సీహెచ్‌జీ) సదస్సుకు పాక్‌ ఆతిథ్యమిస్తోందని, ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జైశంకర్‌ నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పారు.


ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని గత ఆగస్టులో పాక్‌ ఆహ్వానించింది. కాగా, గత తొమ్మిదేళ్ల కాలంలో భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. సుష్మాస్వరాజ్‌ 2015 డిసెంబరులో ఇస్లామాబాద్‌లో అఫ్ఘానిస్థాన్‌పై జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - Oct 05 , 2024 | 05:11 AM