Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?
ABN, Publish Date - Apr 11 , 2024 | 08:56 PM
లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు.
అమృత్ సర్: లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని (Indira Gandhi) హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో (Punjab) గల ఫరీద్ కోట నుంచి పోటీకి దిగారు.
Paris Tour: ప్రజాధనంతో ప్యారిస్‌లో అధికారుల చక్కర్లు
గతంలో పోటీ
గతంలో కూడా ఖాల్సా పోటీ చేశారు. 2009లో బఠిండా నుంచి 2014లో ఫతేగడ్ సాహిబ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఫరీద్ కోట్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో బీఎస్పీ తరఫున ఖాల్సా పోటీ చేశారు. తనకు 3.5 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో ఖాల్సా పేర్కొన్నారు. ఖాల్సా తల్లి బీమల్ కౌర్, నానమ్మ సుచా సింగ్ కూడా రోపర్, బఠిండ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
Eid 2024: ఢిల్లీ చరిత్రలో తొలిసారి.. ముస్లింల ప్రార్థనలు ఇలా..!!
ఇందిరా హత్య
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌లో గల స్వర్ణ దేవాలయంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక చర్యకు దిగింది. ఆ చర్య సిక్కుల ఆగ్రహానికి కారణమైంది. దాంతో ఇందిరాను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బియంత్ సింగ్, సత్వాంత్ సింగ్ అనే సిక్కు బాడీ గార్డ్స్ ఇందిరా గాంధీని హత మార్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 11 , 2024 | 09:00 PM