ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Islamabad: ఇమ్రాన్‌ ఖాన్‌ దంపతులకు ఊరట

ABN, Publish Date - Jul 14 , 2024 | 03:25 AM

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దంపతులకు న్యాయస్థానంలో శనివారం ఊరట లభించింది, ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారంటూ వారిపై ఉన్న అభియోగాలను ఇస్లామాబాద్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టు శనివారం తోసిపుచ్చింది.

  • ‘నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి’ కేసులో నిర్దోషులుగా తీర్పు

ఇస్లామాబాద్‌, జూలై 13 : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దంపతులకు న్యాయస్థానంలో శనివారం ఊరట లభించింది, ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారంటూ వారిపై ఉన్న అభియోగాలను ఇస్లామాబాద్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టు శనివారం తోసిపుచ్చింది. ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీని నిర్దోషులుగా ప్రకటించింది.

అలాగే, ఈ కేసులో దిగువ కోర్టు వారికి విధించిన ఏడేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. ఇమ్రాన్‌-బుష్రా ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారంటూ బుష్రా మాజీ భర్త ఫరీద్‌ ఈ కేసు వేయగా దిగువ కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఇమ్రాన్‌ దంపతులు ఇస్లామాబాద్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో ఇమ్రాన్‌ నిర్దోషి అని తేలినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. అల్లర్లకు సంబంధించి మరో మూడు కేసుల్లో ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు లాహోర్‌ కోర్టు శనివారమే అనుమతినిచ్చింది.

Updated Date - Jul 14 , 2024 | 03:25 AM

Advertising
Advertising
<