Jagdeep Dhankhad : అత్యాచారాలు సర్వసాధారణం అంటారా?
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:14 AM
కోల్‌కతాలో ట్రైనీ డాక్టరుపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనను తక్కువ చేసి చూపారంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్‌ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తప్పుపట్టారు.
కపిల్ సిబల్‌పై ఉపరాష్ట్రపతి విమర్శలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: కోల్‌కతాలో ట్రైనీ డాక్టరుపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనను తక్కువ చేసి చూపారంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్‌ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తప్పుపట్టారు. ఆ దుర్ఘటనపై ప్రజానీకమంతా సిగ్గుతో తలవంచుకున్న సమయంలో కొందరు మాత్రం పుండుపై కారం చల్లారని విమర్శించారు. కోల్‌కతా సంఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో సిబల్ వ్యాఖ్యానిస్తూ ‘అది దుర్బుద్ధికి సూచిక’ అని పేర్కొన్నారు. అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయన్నారు. దీనినే ఉపరాష్ట్రపతి తప్పుపట్టారు. ఆదివారం రిషీకేష్ ఎయిమ్స్‌లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. సిబల్ తమ ఆలోచనలను మార్చుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలను రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పారు. పని స్థలాల్లో వైద్యులకు రక్షణ కల్పించాల్సి ఉందని అన్నారు.
Updated Date - Sep 02 , 2024 | 04:14 AM