రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయడమే కాంగ్రెస్ విధానం: జైరామ్
ABN, Publish Date - Nov 10 , 2024 | 04:18 AM
దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన పరిమితులను ఎత్తివేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, నవంబరు 9: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన పరిమితులను ఎత్తివేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. తెలంగాణలో కుల గణన ప్రారంభించిన నేపథ్యంలో శనివారం ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. 1931 తర్వాత తొలిసారిగా తెలంగాణలో కుల గణన చేపట్టం ఓ విప్లవాత్మకమైన నిర్ణయం అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాకారం చేయడంతోపాటు అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రాహుల్ ఇటీవల హైదరాబాద్‌లో పేర్కొన్నట్టు తెలంగాణలో జరుగుతున్న కుల గణన దేశానికి ఆదర్శం కావాలని తెలిపారు.
Updated Date - Nov 10 , 2024 | 04:18 AM