Rahul Gandhi: జల్, జంగిల్, జమీన్ ఊడలాక్కుంటారు జాగ్రత్త
ABN, Publish Date - Nov 08 , 2024 | 03:59 PM
రాజ్యాంగంపై బీజేపీ నిరంతర దాడి చేస్తోందని, అయితే ఇండియా-కూటమి నిరంతరం రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తామ (కాంగ్రెస్) కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు.
రాంచీ: జార్ఖాండ్ (Jharkhand)లో గిరిజనుల నుంచి నీళ్లు, అడవులు, భూములు (Jal, Jungle, Jameen) ఊడలాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. రాష్ట్రంలోని సిమ్‌డేగా నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులను వనవాసీలుగా ప్రధానమంత్రి మోదీ పిలుస్తుంటారని, వారు నివసించే భూములు, అడవులు, నీళ్లు అన్నీ తమవేనని బీజేపీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారులు నమ్ముతుంటారని అన్నారు. కొత్తగా అభివృద్ధి అనే పేరు తెరపైకి తెచ్చి గిరిజనుల భూములు, అడవులు, నీళ్లు వారికి కానీయకుండా ఊడలాక్కోవాలనే ఆలోచన చేస్తు్న్నారని ఆరోపించారు.
PM Modi: చక్రాలు, బ్రేకుల్లేని బండికి డ్రైవర్ కోసం పోటీ
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తాం..
రాజ్యాంగంపై బీజేపీ నిరంతర దాడి చేస్తోందని, అయితే ఇండియా-కూటమి నిరంతరం రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తామ (కాంగ్రెస్) కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు. షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్‌ను 26 నుంచి 28 శాతానికి, ఎస్‌సీల రిజర్వేషన్‌ను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీల రిజర్వేషన్‌ను 14 నుంచి 27 శాతానికి తాము పెంచుతామని భరోసా ఇచ్చారు.
కులగణనపై..
వివిధ సంస్థల్లో, దేశ సంపదంలో గిరిజనులు, దళితులు, ఓబీసీల పార్టిసిపేషన్‌ను గుర్తించేందుకు కులగణన తప్పనిసరని రాహుల్ అన్నారు. జార్ఖాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారానికి రావడం ఇది రెండోసారి. రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో ఇక్కడ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ
CM Sukhu: సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
For More National and telugu News
Updated Date - Nov 08 , 2024 | 03:59 PM