Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ABN, Publish Date - Aug 26 , 2024 | 10:39 AM
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం ఉదయం విడుదలైంది. 44 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది.
కశ్మీర్: జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం ఉదయం విడుదలైంది. 44 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమటీ సమావేశం నిర్వహించింది. అనంతరం అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది.
రాజ్‌పోరా నుంచి అర్షిద్ భట్, షోపియాన్ నుంచి జావేద్ అహ్మద్ ఖాద్రీ, అనంత్‌నాగ్ వెస్ట్ - మహ్మద్ రఫీక్ వానీ, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా - సోఫీ యూసుఫ్, రాంబన్ - రాకేష్ ఠాకూర్, బనిహాల్ - సలీం భట్, శ్రీ మాతా వైష్ణో దేవి - రోహిత్ దూబేలను పార్టీ బరిలోకి దించింది. జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 2024లో జరగనున్న జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది.
ఆర్టికల్ రద్దు, తరువాతి పరిణామాలు..
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 3 దశల్లో... సెప్టెంబరు 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు విడుదలవుతాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. 2014లో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం కాదు. ఆ ఎన్నికల్లో పీడీపీ 28, భారతీయ జనతా పార్టీ 25, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి.
తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని కేంద్రం ఆగస్ట్ 5, 2019 రద్దు చేసి.. జమ్ముకశ్మీర్, లఢక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దాదాపు 10 ఏళ్ల తరువాత మళ్లీ అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.
బీజేపీ ఫస్ట్ లిస్ట్ చూసేయండి..
Updated Date - Aug 26 , 2024 | 11:15 AM