ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హరియాణా, జమ్మూ కశ్మీర్‌ ఫలితాలు నేడు

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:10 AM

జమ్మూ కశ్మీర్‌, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. హరియాణాలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించనుందని..

  • కశ్మీర్‌లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేలే కీలకమా?

  • బీజేపీ ఎత్తులపై ఎన్సీ, కాంగ్రెస్‌లో గుబులు

  • వీలైతే పీడీపీతో కలుస్తాం: ఫరూక్‌ అబ్దుల్లా

న్యూఢిల్లీ, అక్టోబరు 7: జమ్మూ కశ్మీర్‌, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. హరియాణాలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించనుందని.. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇవే నిజమైతే బీజేపీకి ఈ ఫలితాలు అతిపెద్ద షాక్‌ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హరియాణాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈనెల 5న జరిగిన పోలింగ్‌లో 65.65శాతం ఓటింగ్‌ నమోదైంది.

జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1.. ఇలా మూడు దశల్లో పోలింగ్‌ జరిగింది. కౌటింగ్‌ నేపథ్యంలో ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా జమ్మూ కశ్మీర్‌లో అత్యధిక స్థానాలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమిదేనని.. హంగ్‌ ఖాయమని అంచనాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ ‘ఐదుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేల’లు కీలకం కానున్నారు. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌.. ఐదుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి నామినేట్‌ చేయనున్నారు. ఫలితంగా సభ్యుల సంఖ్య 95కు చేరనుంది.

Updated Date - Oct 08 , 2024 | 03:20 AM