మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kishan Chand Tyagi : అగ్నిపథ్‌ను సమీక్షించాలి

ABN, Publish Date - Jun 07 , 2024 | 03:05 AM

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్‌ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

 Kishan Chand Tyagi : అగ్నిపథ్‌ను  సమీక్షించాలి

  • జేడీయూ తొలి డిమాండ్‌

  • ‘వన్‌ నేషన్‌.. వన్‌ పోల్‌’కు ఓకే

  • దేశవ్యాప్త కులగణన.. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలి

  • యూసీసీపై భాగస్వాములతో చర్చించాలి: కేసీ త్యాగి

  • ఉమ్మడి పౌరస్మృతిపై భాగస్వాములతో చర్చించాలి: కేసీ త్యాగి

  • అగ్నిపథ్‌ సమీక్షకు గొంతు కలిపిన చిరాగ్‌ పాసవాన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 6: కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్‌ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ సీనియర్‌ నేత కేసీ త్యాగి అగ్నిపథ్‌ పథకాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేస్తామని గురువారం ప్రకటించారు. అగ్నిపథ్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అది ఎన్నికల సమయంలో స్పష్టంగా కనిపించిందని త్యాగి చెప్పారు.

అగ్నిపథ్‌ను తాము వ్యతిరేకించడం లేదు కానీ.. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే బీజేపీ చెబుతున్న ‘వన్‌ నేషన్‌.. వన్‌ పోల్‌’ విధానానికి తమ పార్టీ అనుకూలమేనని ఆయన చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై మాత్రం భాగస్వాములందరినీ సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని, బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని త్యాగి కోరారు. అగ్నిపథ్‌ను సమీక్షించాలని లోక్‌ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్‌ పాసవాన్‌ కూడా కోరారు.

Updated Date - Jun 07 , 2024 | 03:05 AM

Advertising
Advertising