ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

ABN, Publish Date - May 15 , 2024 | 07:58 PM

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.

రాంచీ: మనీ లాండరింగ్ (Money Laundering) కేసులో జార్ఖాండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ (Alamgir Alam)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది. మంత్రి పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడు జహంగీర్ ఆలమ్ నివాసంలో రూ.35 కోట్ల నగదును ఈడీ ఇటీవల స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆ ఇద్దరినీ అరెస్టు చేసింది.

Sachin Tendulkar: తుపాకీతో కాల్చుకున్న సచిన్ టెండూల్కర్ వీవీఐపీ సెక్యూరిటీ గార్డ్.. ఎస్‌ఆర్‌పీఎఫ్‌లో కలకలం


కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం కోసం వేసిన టెండర్‌‌కు అనుమతించినందుకు ప్రతిగా రూ.35 కోట్లు కమిషన్‌గా తీసుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. లంచం సొమ్ముకు కేర్‌టేకర్‌గా తనను ఉంచారని, ఇందుకు గాను నెలకు రూ.15,000 చొప్పున వేతనం ఇస్తున్నారని జహంగీర్ ఆలమ్ ఈడీ ప్రాథమిక ఆచరణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. సంజీవ్ కుమార్ లాల్ రాంచీలోని సర్ సైయద్ రెసిడెన్స్ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు ఉంటూ డబ్బుల కట్టలున్న బ్యాగ్‌ను తరచు జహంగీర్‌కు ఇచ్చేవాడని, అక్కడి కప్ బోర్డులో అతను ఉంచేవాడని తెలుస్తోంది. అయితే, ఫ్లాట్‌లో దొరికిన సొమ్ము తనది కాదని సంజీవ్ లాల్ మొదట బుకాయించాడని, జహంగీర్ ఇచ్చిన సాక్ష్యంతో ఆయనను ఏజెన్సీ అరెస్టు చేసిందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పట్టుబడిన సొమ్ముపై బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన అలంగీర్ ఆలమ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ ఆయన నుంచి సంతృప్తికరమైన సమధానం రాకపోవడంతో వెంటనే అదుపులోనికి తీసుకుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:58 PM

Advertising
Advertising