Reliance Jio: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ప్లాన్..
ABN, Publish Date - Dec 23 , 2024 | 08:11 AM
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో, ఎయిర్‌టెల్, ఓడాఫోన్ ఐడియా వంటివి రీఛార్జ్ మోతలు మోగిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ల వినియోగదారుల నెల రోజులకు సంబంధించి మెుబైల్ రీఛార్జ్ చేసేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో, ఎయిర్‌టెల్, ఓడాఫోన్ ఐడియా వంటివి రీఛార్జ్ మోతలు మోగిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ల వినియోగదారుల నెల రోజులకు సంబంధించి మెుబైల్ రీఛార్జ్ చేసేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మెుగ్గుచూపుతున్నారు. ఇప్పటికే లక్షల మంది కస్టమర్లు ఈ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. దీంతో అప్రమత్తమైన జియో రీఛార్జ్ రేట్లను తగ్గించేందుకు అడుగులు వేస్తోంది. ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు, ఉన్న కస్టమర్లు కాపాడుకునేందుకు అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. జియో 6 నెలల(200 రోజులు)కు గానూ రూ.2025 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించి తన 49 కోట్ల మంది కస్టమర్లకు నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
ప్లాన్ వివరాలు ఇవే..
200 రోజులకుగానూ రూ.2025 రీఛార్జ్‌తో అపరిమిత కాల్స్, 500 జీబీ హై-స్పీడ్ డేటాతో రిలయన్స్ జియో న్యూ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారుడు 200 రోజులపాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత SMSలు పొందుతారు. ఆరు నెలల కాలానికి 500 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2.5 GBని వినియోగించుకోవచ్చు. మరోవైపు రూ.2025 ప్లాన్ ద్వారా కేవలం కాల్స్, డేటా మాత్రమే కాదు ఓటీటీ ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది. జియో సినిమా, జియో టీవీ, డేటా స్టోర్ చేసుకునే జియో క్లౌడ్ వంటి వాటినీ ఉచితంగా పొందవచ్చు.
సరసమైన ధర, హై-స్పీడ్ 5G డేటా, OTT పెర్క్‌ల ఉచిత సభ్యత్వం వంటి కలయిక ద్వారా రూ.2025 ప్లాన్ టెలికాం మార్కెట్లో గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో నుంచి BSNLకు మారిన వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో డేటా వినియోగించే అవకాశమే లేకుండా పోతుంది. దీంతో ఈ సరసమైన ప్లాన్ ద్వారా జియో పాత కస్టమర్లను తిరిగి తెచ్చుకోవాలని చూస్తోంది. రీఛార్జ్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే భావనతో ఉన్న 49 కోట్ల మంది వినియోగదారులకు సైతం ఈ ప్లాన్ ఊరట ఇస్తుందని భావిస్తోంది. అందుకే నూతన సంవత్సరం వేళ ఈ ఆకర్షణీయ ప్లాన్‌తో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
Updated Date - Dec 23 , 2024 | 08:11 AM