ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: లూటీ చేసిన సొమ్ములు కక్కిస్తాం

ABN, Publish Date - Nov 10 , 2024 | 04:56 PM

కాంగ్రెస్-జేఎంఎం కూటమి ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, ఉపకులాలను ఉసిగొలుపుతోందని మోదీ ఆరోపించారు. ఛోటానగర్ ప్రాంతంలో 125 ఓబీసీ ఉప కులాలు ఉన్నాయని మోదీ అన్నారు. అంతా కలిసి ఉంటేనే అందరికీ క్షేమమని అన్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్-జేఎంఎం కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నిప్పులు చెరిగారు. ఇసుక మైనింగ్‌‌లో కోట్లాది రూపాయలను నేతలు (JMM) దోచుకున్నారని, వారి వద్ద కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయని చెప్పారు. ఈ దోచుకున్న సొమ్మంతా ప్రజల సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. ఆ సొమ్మంతా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్కిస్తామని, అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తామనని హామీ ఇచ్చారు. ఈ పోరాటాన్ని కోర్టుల ముందుంచుతామని, మీ సొమ్ము మీకే వెచ్చిస్తామని స్పష్టం చేశారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బొకారోలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే జార్ఖాండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని తాను భరోసాగా చెబుతున్నానని అన్నారు.

Amit shah: మహారాష్ట్ర తదుపరి సీఎం షిండే కాదా?.. అమిత్‌షా ఏమన్నారంటే


కలిసి ఉంటేనే...

కాంగ్రెస్-జేఎంఎం కూటమి ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, ఉపకులాలను ఉసిగొలుపుతోందని మోదీ ఆరోపించారు. ఛోటానగర్ ప్రాంతంలో 125 ఓబీసీ ఉప కులాలు ఉన్నాయన్నారు. అంతా కలిసి ఉంటేనే అందరికీ క్షేమమని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, సోనియాగాంధీ దీనికి సారథ్యం వహించారని గుర్తుచేస్తూ, పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 80,000 కోట్లు జార్ఖాండ్‌కు కేటాయించిందని చెప్పారు. 2014లో మోదీకి కేంద్రంలో సేవ చేసే అవకాశం ఇచ్చిన తర్వాత గత పదేళ్లలో జార్ఖాండ్‌కు రూ.3 లక్షల కోట్లకు పైగా కేటాయించామని చెప్పారు. జార్ఖాండ్‌ను తామే ఏర్పాటు చేశామని, ఎక్కువ నిధులిచ్చాయమని, జార్ఖాండ్ అభివృద్ధి బాధ్యత తమ భుజస్కంధాలపై ఉందని చెప్పారు.


ఒక్క బటన్ నొక్కితే చాలు...

ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చుపెట్టాలని, అతి ప్రజల హక్కు అని, వారికి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన హక్కు అని మోదీ అన్నారు. గతంలో కేంద్రం పంపిన నిధులు దారిమళ్లడం, అవినీతి చోటుచేసుకోవడం జరిగేదని, లూటీలు చేసే వాళ్లు ప్రతిచోట ఉన్నారని చెప్పారు. దీనిని అడ్డుకునేందుకే టెక్నాలజీని తెచ్చామని, ఢిల్లీలో ఒక బటన్ నొక్కితే నిధులు లబ్ధిదారుల ఫోన్లకు నేరుగా జమ అవుతాయని చెప్పారు. అధునాతన బొకారో రైల్వే స్టే్షన్‍ను త్వరలోనే ప్రజలు చూస్తారని అన్నారు. కాగా, ర్యాలీ అనంతరం 5.30 గంటలకు ఓటీసీ గ్రౌండ్ నుంచి న్యూ మార్కెట్ చౌక్ వరకూ జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొంటున్నారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 20న జరుగనున్నారు. నవంబర్ 23న కౌంటింగ్ జరుగుతుంది.


ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సారీ నాన్నా అమ్మను చంపేశా

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

For More National And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 04:59 PM