ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JP Nadda: ‘కళ్లకురిచ్చి’పై మౌనం ఎందుకు?

ABN, Publish Date - Jun 24 , 2024 | 06:26 PM

తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీ సారా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించక పోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విస్మయం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ, జూన్ 21: తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీ సారా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించక పోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విస్మయం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు జేపీ నడ్డా లేఖ రాశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఇండియా కూటమిలో భాగమైన డీఏంకే ప్రభుత్వాన్ని మీరు కోరాలంటూ ఖర్గేను జేపీ నడ్డా విజ్జప్తి చేశారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తిరు ముత్తుస్వామిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయాలన్నారు.


ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ సైతం స్పందించడం లేదన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వారి బాధను వినేందుకు ఈ అగ్రనేతలను ఒప్పించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జేపీ నడ్డా సూచించారు. ఈ ఘటనను కప్పి పుచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.

మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్ ఆవరణలోని మహత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్లన్లతో తాము నిరసన చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ లేఖ ద్వారా ఆహ్వానించారు. తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్లీ సారా తాగి మరణించిన వారి సంఖ్య సోమవారానికి 57కు చేరింది. అలాగే ఈ ఘటనలో బాధితులుగా మారిన 156 మంది జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇక నీట్ పరీక్ష పత్రాలు లీక్ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ పరీక్ష పత్రాల లీక్ బాధ్యత మోదీ ప్రభుత్వానిదేనంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు సంధిస్తున్నారు. అలాంటి వేళ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షపైన స్టాలిన్ ప్రభుత్వంపై కల్తీ సారా తాగి 57 మంది మరణించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదంటూ బీజేపీ సందేహం వ్యక్తం చేస్తూ.. ఆ పార్టీ అధినేతకు సూటిగా లేఖాస్త్రం సంధించింది.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 06:27 PM

Advertising
Advertising