ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Justice Sreeshanand: తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన కర్ణాటక హైకోర్టు జడ్జి శ్రీశానంద

ABN, Publish Date - Sep 23 , 2024 | 03:16 AM

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీశానంద తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

బెంగళూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీశానంద తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని శనివారం బెంచ్‌కు హాజరు కాగానే ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోని గోరిపాళ్య.. పాకిస్థాన్‌ లాంటిదని, మైసూరు ఫ్లైఓవర్‌పై వెళ్లే ఆటోల్లో నిత్యం పరిమితికి మించి ప్రయాణిస్తారని న్యాయమూర్తి గతంలో వ్యాఖ్యలు చేశారు.


అదే తరహాలోనే ఓ మహిళా న్యాయవాది పట్ల అనుచితంగా మాట్లాడిన వీడియోలు వైరల్‌ కావడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా తీసుకుని, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ వివాదం తీవ్రమవుతుండడంతో జస్టిస్‌ శ్రీశానంద స్పందించారు.

Updated Date - Sep 23 , 2024 | 03:16 AM