ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kanimozhi: కనిమొళి ఆస్తులు రూ.57.32 కోట్లేనట...

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:13 PM

తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్న డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి(Kanimozhi) ఆస్తులు గత ఐదేళ్లలో 80 శాతం పెరిగాయి.

- ఐదేళ్లలో 80 శాతం పెంపు

చెన్నై: తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్న డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి(Kanimozhi) ఆస్తులు గత ఐదేళ్లలో 80 శాతం పెరిగాయి. నామినేషన్‌తోపాటు సమర్పించిన ఆస్తుల జాబితా వివరాల ప్రకారం ఆమె రూ. 57.32 కోట్ల మేరకు ఆస్తులు కలిగి ఉన్నారు. 2019లో నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన ఆస్తుల జాబితా ప్రకారం అప్పట్లో ఆమెకు రూ.30.34 కోట్ల మేరకు ఆస్తులు ఉండేవి. ఇక తాజా వివరాల ప్రకారం కనిమొళి రూ. కోటి 37లక్షల 16వేల 290ల విలువైన 3 కార్లు కలిగి ఉన్నారు. 704 గ్రామలు బంగారు, 13.03 కేరట్‌ వజ్రం తదితర విలువైన ఆభరణాలు కలిగి ఉన్నారు. ఆమె వద్ద నున్న నగల మొత్తం విలువ రూ.55.37 లక్షలు. ఇక నగదు, బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసిన నగదు అంటూ మొత్తం రూ.18.54 కోట్ల మేరకు స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఇక కనిమొళి భర్త అరవిందన్‌ పేరిట నగదు, కారు అంటూ రూ.66.21 లక్షల విలువైన చరాస్థులు ఉన్నాయి. ఇక స్థలాలు వాణిజ్యభవనం, నివాసగృహం అంటూ రూ.2.26 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అదే విధంగా రూ.60లక్షల 60వేలకు పైగా రుణం పొంది ఉన్నానని, భర్త పేరిట ఎలాంటి రుణాలు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో కనిమొళి పేర్కొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 01:13 PM

Advertising
Advertising