ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kareena Kapoor: పుస్తకం తెచ్చిన కష్టాలు... కరీనా కపూర్‌కు లీగల్ నోటీసు

ABN, Publish Date - May 11 , 2024 | 08:49 PM

బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ చిక్కుల్లో పడ్డారు. తన ప్రెగ్నసీకి చెందిన అనుభవాలతో రాసిన 'ప్రెగ్నన్సీ బైబిల్' అనే పుస్తకం ఈ చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బుక్ టైటిల్‌లో 'బైబిల్' అనే పదం వాదటం తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోని పిటిషన్ వేశారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కరీనాకపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు పంపింది.

ముంబై: బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ (Kareena Kapoor) లీగల్ చిక్కుల్లో పడ్డారు. కెరీర్‌ పరంగా ఈ ఏడాది ఆమెకు కలిసి వచ్చినప్పటికీ తన ప్రెగ్నసీకి చెందిన అనుభవాలతో రాసిన 'ప్రెగ్నన్సీ బైబిల్' (Pregnancy Bible) అనే పుస్తకం ఈ చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బుక్ టైటిల్‌లో 'బైబిల్' అనే పదం వాదటం తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోని పిటిషన్ వేశారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కరీనాకపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు పంపింది.


కరీనా కపూర్ పుస్తకం క్రిస్టియన్ల మనోభావాలను గాయపరిచేలా ఉందని, ఆమెపై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పుస్తకంపై నిషేధం విధించాలని కూడా కోరారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లూవాలియా ఏకసభ్య ధర్మాసనం కరీనాకపూర్‌కు నోటీసు ఇచ్చింది. జూలై 1న కేసు తదుపరి విచారణ లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ''కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నన్సీ బైబిల్: ది అల్టిమేట్ మాన్యువల్ ఫర్ మామ్స్-టు-బి'' అనే పేరుతో 2021 ఆగస్టులో విడుదలై ఈ పుస్తకాన్ని కరీనాకపూర్ ఖాన్‌ కలిసి అదితి షా భీమ్‌జ్యాని రచించారు.

Updated Date - May 11 , 2024 | 08:52 PM

Advertising
Advertising